![]() |
![]() |

అదేమి చిత్రమో గానీ.. నేచురల్ స్టార్ నానితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు ఒక్కొక్కరిగా ఈ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ కి సిల్వర్ స్క్రీన్ డాటర్స్ అయిపోతున్నారు. నిన్నటికి నిన్న నివేదా థామస్ ఇలా రజినీకి కూతురిగా ఆకట్టుకుంటే.. ఇప్పుడా బాటలో మరో నాని హీరోయిన్ వెళ్ళనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. నాని `జెంటిల్ మన్` (2016)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్.. రెండేళ్ళ క్రితం పొంగల్ కి ఎంటర్టైన్ చేసిన `దర్బార్` (2020)లో సూపర్ స్టార్ కుమార్తె పాత్రలో కనిపించింది. కట్ చేస్తే.. నివేదా తరహాలోనే నాని నటించిన `గ్యాంగ్ లీడర్` (2019) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్ కూడా.. త్వరలో రజినీకాంత్ కి కూతురిగా నటించబోతోందట. ఆ వివరాల్లోకి వెళితే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ కథానాయకుడిగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రజినీకి జోడీగా ఐశ్వర్యా రాయ్ కనిపించనుండగా.. కుమార్తెగా ప్రియాంక దర్శనమివ్వనుందని కోలీవుడ్ టాక్. త్వరలోనే `తలైవర్ 169`లో ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నెల్సన్ గత చిత్రం `డాక్టర్`లో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. శివ కార్తికేయన్ హీరోగా యాక్ట్ చేసిన ఆ సినిమాతోనే కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ప్రియాంక.
![]() |
![]() |