![]() |
![]() |

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డీజే టిల్లు'. ఫిబ్రవరి 12 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై మంచి లాభాలను పొందిన ఈ సినిమాలో ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.
థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన 'డీజే టిల్లు'.. మూడు వారాలకే మార్చి 4 న ఓటీటీ వేదిక ఆహాలో విడుదలైంది. విడుదలైన 48 గంటల్లోనే రికార్డు వ్యూస్ తో ఓటీటీలో సత్తా చాటింది. ఈ మూవీ రెండు రోజుల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. శ్రీచరణ్ సంగీతం అందించిన ఈ మూవీకి తమన్ నేపథ్య సంగీతం అందించాడు.
![]() |
![]() |