![]() |
![]() |

'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ 'అనుపమ పరమేశ్వరన్'.. ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేసే అనుపమ తాజాగా నటిస్తోన్న చిత్రం 'బటర్ ఫ్లై'. గంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.
"నీ కళ్లను నమ్మొద్దు.. బ్రెయిన్ ను కూడా నమ్మొద్దు.. మరి దేనిని నమ్మాలి" అంటూ 'బటర్ ఫ్లై' టీజర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. 40 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అనుపమని ఎవరో తరుముతున్నట్లు, ఆమె ఎవరి కోసమో వెతుకుతున్నట్లుగా టీజర్ లో కనిపించింది. అనుపమ తనని తాను తలపై కొట్టుకొని గాయపరుచుకోవడంతో టీజర్ ముగిసింది. అనుపమ అలా చేయడానికి కారణం తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇదొక థ్రిల్లర్ సినిమా ని అర్థమవుతోంది. ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాతో నిరాశపరిచిన అనుపమ ఈ సినిమాతో ఆకట్టుకుంటుందేమో చూడాలి.
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి 'బటర్ ఫ్లై' సినిమాని నిర్మిస్తున్నారు. రవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. 'బటర్ ఫ్లై'తో పాటు '18 పేజెస్', 'కార్తికేయ-2' సినిమాలతోనూ అనుపమ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల్లోనూ నిఖిల్ హీరో కావడం విశేషం.
![]() |
![]() |