![]() |
![]() |

యువ సామ్రాట్ నాగచైతన్యకి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. వీరిద్దరి కలయికలో `100 % లవ్`(2011), `దడ` (2011), `రారండోయ్.. వేడుక చూద్దాం` (2017) వంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు కూడా మ్యూజికల్ గా మెప్పించాయి. కమర్షియల్ కోణంలో చూస్తే.. `దడ` మాత్రమే డిజప్పాయింట్ చేసింది.
ఇదిలా ఉంటే, ఐదేళ్ళ విరామం అనంతరం నాగచైతన్య, దేవి శ్రీ ప్రసాద్ మరోమారు జట్టుకట్టనున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా కోలీవుడ్ లో `మానాడు` వంటి సంచలన విజయం అందుకున్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు.. చైతూతో ఓ మూవీ తీయబోతున్నాడు. 1990ల కాలం నాటి వాతావరణంతో ఓ పిరియడ్ డ్రామాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుందట. తెలుగు - తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డేని నాయికగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బజ్. అంతేకాదు.. ఈ ద్విభాషా చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే నాగచైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్ మూవీపై, అందులో డీఎస్పీ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |