![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన 'భీమ్లా నాయక్' ఆరు రోజుల్లోనే 'వకీల్ సాబ్' టోటల్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.86.36 కోట్ల షేర్ రాబట్టగా.. భీమ్లా నాయక్ ఆరు రోజుల్లోనే రూ.87.79 కోట్ల షేర్ కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ 108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 87.79 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 20.21 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన భీమ్లా నాయక్.. ఆరు రోజుల్లో 68.82 కోట్లు రాబట్టింది. ఇప్పటిదాకా తెలంగాణలో 32.82 కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 36 కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ ఆరు రోజుల్లో 11.45 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా 9 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఇప్పటిదాకా 7.52 కోట్లు కలెక్ట్ చేసింది.
ఏపీలో టికెట్ ధరలు తక్కువగా లేకపోతే భీమ్లా నాయక్ మరో పదికోట్లు అదనంగా కలెక్ట్ చేసేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 11 న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' విడుదల కానుంది. ఆలోపు ఈ వారం రోజుల్లో మ్యాగ్జిమమ్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. మరి ఈ వారం పవర్ స్టార్ తన పవర్ చూపించి భీమ్లాను విజయ తీరాలకు చేరుస్తాడేమో చూద్దాం.
![]() |
![]() |