![]() |
![]() |

సౌత్ లో స్టార్ హీరోయిన్ హోదాని చూసిన శ్రియ రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ఆండ్రూ కొశ్చివ్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తన భర్త ఆసుపత్రి పాలయ్యాడని శ్రియ తెలిపింది. రెండు నెలల పాటు తన బిడ్డ రాధాను ఎత్తుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.
కొంతకాలం పాటు తన భర్త హెర్నియాతో బాధ పడ్డాడని, తమ పాపను కూడా ఎత్తుకోలేకపోయాడని శ్రియ చెప్పుకొచ్చింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నాడని తెలిపిన ఆమె.. అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి, ఉపాసనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. ఈ మేరకు తన భర్త ఆసుపత్రిలో ఉన్న ఫోటోలను శ్రియ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

పెళ్లి తర్వాత కూడా శ్రియ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమె కీలక పాత్ర పోషించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
![]() |
![]() |