![]() |
![]() |

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం, తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంతో కిరీటిని హీరోగా పరిచయం చేయనుంది. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కిరీటికి గుడ్ లాంచ్ కానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. విభిన్న క్రాఫ్ట్‌లను నిర్వహించడానికి మేకర్స్ అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను కూడా ఎంచుకున్నారు.
సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, 'బాహుబలి' లెన్స్‌మెన్ కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్, భారతదేశపు టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫ్ చేస్తారు. మార్చి 4న ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ జరగనుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఇంతకీ కిరీటి ఎవరో కాదు.. బళ్లారికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి కుమారుడు. యూకేలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుకున్న కిరీటి, అక్కడే యాక్టింగ్‌లో శిక్షణ పొందాడు. అంతేకాదు, యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే అతను పలు రకాల మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. డాన్సింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకున్న అతను త్వరలో కెమెరాను ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
![]() |
![]() |