![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన `1 నేనొక్కడినే`(2014)తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ డాళ్ కృతి సనన్. ఆపై యువ సామ్రాట్ నాగచైతన్యకి జోడీగా `దోచేయ్`(2015)లో సందడి చేసింది. ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్ వైపే దృష్టి సారించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో ఓ పాన్ - ఇండియా మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆ చిత్రమే.. `ఆది పురుష్`. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓమ్ రౌత్ రూపొందించిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ లో జానకిగా కనువిందు చేయనుంది కృతి సనన్. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ భారీ బడ్జెట్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కృతి సనన్ కెరీర్ లో ఇప్పటివరకు ఒకే ఒక సినిమా సంక్రాంతి సీజన్ లో సందడి చేసింది. ఆ చిత్రమే.. కృతి కథానాయికగా నటించిన ఫస్ట్ ఫిల్మ్ `1 నేనొక్కడినే`. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముంగిట అంతగా మెప్పించలేకపోయింది. మరి.. తొమ్మిదేళ్ళ తరువాత మరో టాలీవుడ్ టాప్ స్టార్ తో అదే సీజన్ లో రాబోతున్న కృతి సనన్ కి.. ఈ సారైనా ముగ్గుల పండగ కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |