![]() |
![]() |

`వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`.. ఇలా రి-ఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ రీమేక్ హిట్స్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాక్సాఫీస్ ముంగిట కాసుల వర్షం కురిపించిన ఈ రెండు సినిమాలకి కూడా యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించాడు. పవన్ కి అచ్చొచ్చిన సంగీత దర్శకుల జాబితాలో చేరిపోయాడు.
కట్ చేస్తే.. త్వరలో పవన్, తమన్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతోందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో పవన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `యథా కాలమ్.. తథా వ్యవహారమ్..` అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి నిర్మించనుండగా.. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కన్ఫామ్ అయ్యాడని బజ్. త్వరలోనే పవన్ - సురేందర్ సినిమాలో తమన్ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కాగా, గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన `కిక్`, `రేసు గుర్రం`, `కిక్ 2` వంటి చిత్రాలకు తమన్ స్వరాలు సమకూర్చాడు.
![]() |
![]() |