![]() |
![]() |

`శ్యామ్ సింగ రాయ్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న సినిమా `అంటే.. సుందరానికీ!`. ఇందులో కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అనే పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నాడు నాని. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. కేరళకుట్టి నజ్రీయా ఫహద్ కథానాయికగా నటించగా వివేక్ సాగర్ సంగీతమందించాడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాని వేసవి చివరలో రిలీజ్ చేయనున్నారు. జూన్ 10ని విడుదల తేదిగా ఫిక్స్ చేశారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో జూన్ నెల వేదికగా నాని హీరోగా నటించిన సినిమాలు విడుదలై మంచి విజయం సాధించాయి. ఆ చిత్రాలే.. `రైడ్` (2009), `జెంటిల్ మన్` (2016). మరి.. ముచ్చటగా మూడోసారి జూన్ నెలలో రాబోతున్న ఈ సినిమాతో నాని మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగర్, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన `అంటే.. సుందరానికీ!`కి నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం అందించాడు.
![]() |
![]() |