![]() |
![]() |

'ఉప్పెన' వంటి సంచలన చిత్రంతో కథానాయకుడిగా తొలి అడుగేశాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే, రెండో సినిమాగా రిలీజైన `కొండ పొలం` నటుడిగా పేరు తెచ్చినా, కమర్షియల్ హిట్ అందించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. మూడో చిత్రం `రంగ రంగ వైభవంగా`పైనే ఆశలు పెట్టుకున్నాడు వైష్ణవ్. గిరీశయ్య డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ పొలిటికల్ డ్రామాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా `రొమాంటిక్` ఫేమ్ కేతికా శర్మ నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ హీరోలతో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన సినిమాలేవీ ఫెయిల్యూర్ కాలేదు. సహ నిర్మాత హోదాలో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన `మగధీర` ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో చేసిన `ఆర్య 2` ఓకే అనిపించుకుంది. అలాగే, సోలో ప్రొడ్యూసర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మించిన `అత్తారింటికి దారేది` ఇండస్ట్రీ హిట్ గా నిలవగా.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రొడ్యూస్ చేసిన `తొలి ప్రేమ`, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తో నిర్మించిన `సోలో బ్రతుకు సో బెటర్` కూడా విజయం సాధించాయి. మరి.. ఈ ఫ్యాక్టర్ కలిసొచ్చి వైష్ణవ్ తేజ్ కూడా బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబోలో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, వేసవి కానుకగా మే 27న `రంగ రంగ వైభవంగా` ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |