![]() |
![]() |

ఆగష్టు 11, 2022న విడుదల కావాల్సిన ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఆదిపురుష్'.. ఆమిర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' కోసం వెనక్కెళ్ళిన సంగతి తెలిసిందే. 'లాల్ సింగ్ చద్దా' సినిమాని ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఆ సమయానికి సినిమా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఆగష్టు 11 కి వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకొని తమ కోసం విడుదల తేదీని త్యాగం చేసిన ఆదిపురుష్ మూవీ టీమ్ కి కృతఙ్ఞతలు తెలిపారు. దీంతో 'ఆదిపురుష్' దీపావళి కానుకగా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశముందని వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమా అసలు ఈ ఏడాదే విడుదల కావట్లేదు.
మహాశివరాత్రి సందర్భంగా నేడు ఆదిపురుష్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023 న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' విడుదల కావాల్సి ఉండగా, కరోనా థర్డ్ వేవ్ కారణంగా మార్చి 11 కి వాయిదా పడింది. ఈ సంక్రాంతిని మిస్ చేసుకున్న ప్రభాస్ వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. అయితే 'ఆదిపురుష్' వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ కావడంపై ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. అయితే కొందరు మాత్రం లేట్ అయినా కరెక్ట్ ఔట్ పుట్ తో వస్తారని అభిప్రాయపడుతున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాఘవ్(రాముడు)గా కనిపించనుండగా, జానకి(సీత)గా కృతి సనన్, లంకేష్(రావణుడు)గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
![]() |
![]() |