![]() |
![]() |

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి.. 'లవ్ స్టోరి', 'శ్యామ్ సింగ రాయ్' వంటి సినిమాలతో ఆకట్టుకుంది. తక్కువ సినిమాలతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సాయి పల్లవిని లేడీ పవన్ కళ్యాణ్ అంటూ తాజాగా డైరెక్టర్ సుకుమార్ ప్రశంసించారు.
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ 'ఆడవాళ్ళు నీకు జోహార్లు'. మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ తో పాటు హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తి సురేష్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ రష్మిక, సాయి పల్లవి, కీర్తి తన ఫేవరెట్ హీరోయిన్స్ అని అన్నారు.
"గ్యాంగ్ లీడర్ సమంత మిస్ అయింది. సమంతతో పాటు వీళ్ళ ముగ్గురూ బాగా పర్ఫామ్ చేసే హీరోయిన్స్. మా శ్రీవల్లి(రష్మిక) చాలా అందంగా చేస్తుంది. కీర్తి గురించి చెప్పాల్సిన పని లేదు. నేషనల్ అవార్డు విన్నర్." అంటూ సాయి పల్లవి గురించి చెప్దామని సుకుమార్ ఆమె పేరు చెప్పగానే అక్కడున్న ఆడియెన్స్ ఒక్కసారిగా గట్టిగా ఉత్సాహంతో కేకలు వేశారు. ఆ రెస్పాన్స్ చూసి 'నువ్వు లేడీ పవన్ కళ్యాణ్ వి' అంటూ సాయి పల్లవిని ప్రశంసించారు సుకుమార్. ఆమె మంచి ఆర్టిస్ట్ తో పాటు మంచి మనసున్న మనిషి అని, ఈ ఫీల్డ్ లో అలా ఉండటం చాలా కష్టమని సుకుమార్ కొనియాడారు.
"దేవిశ్రీప్రసాద్ జడ్జిమెంట్ ని నేను చాలా నమ్ముతాను. కావాలంటే ఒక సీన్ మళ్ళీ తీయమన్నా తీస్తాను. అంత నమ్మకం దేవి అంటే. ఈ సినిమా చూసి దేవి అదిరిపోయింది అన్నాడు. అందుకే ఈ సినిమా హిట్ అని నమ్మకంగా చెబుతున్నా. నాకిష్టమైన డైరెక్టర్ కిషోర్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా తీయాలి. నేను శర్వానంద్ కి బిగ్ ఫ్యాన్ ని. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని సుకుమార్ అన్నారు.
![]() |
![]() |