![]() |
![]() |

భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఎంతలా ఎదురుచూశారో త్రివిక్రమ్ స్పీచ్ కోసం కూడా అదే స్థాయిలో ఎదురుచూశారు. కానీ ఆ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడకుండా ఫ్యాన్స్ ని నిరాశపరిచారు. అయితే తాజాగా జరిగిన భీమ్లా నాయక్ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ తన స్పీచ్ తో అదరగొట్టారు. కానీ ఈ మీట్ లో ఆయన 80-90 లలోని నటులను తక్కువ చేసేలా మాట్లాడిన తీరు వివాదాస్పదమయ్యే అవకాశముంది.
"అయ్యప్పనుమ్ కోషియంని భీమ్లా నాయక్ గా మలచడానికి ఎంతో కష్టపడ్డాం. ఒరిజినల్ నుంచి దూరం జరిగి, బ్యాలెన్సింగ్ గా రాసుకున్నాం. ఈ సినిమాలో పని చేసిన చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా మాణిక్, చౌదరి, హరిణి(మౌనిక రెడ్డి) వంటి వారు చాలా బాగా చేశారు. మేం చెప్పింది తక్కువే. రాసింది చదివి, ఓన్ చేసుకొని చేశారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ జనరేషన్ యాక్టర్స్ 80-90 ల నాటి యాక్టర్స్ కంటే బెటర్ గా చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ కొంతమందిని బాధపెడితే నన్ను క్షమించాలి. ఈ ఐదారేళ్లలో యాక్టర్స్ లో గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. కేవలం డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం, పర్ఫార్మ్ చేయడం కాదు.. అన్ని క్రాఫ్ట్స్ ని వాళ్ళు అర్థంచేసుకుంటున్న విధానానికి హ్యాట్సాఫ్." అని త్రివిక్రమ్ అన్నారు.
ఈ సినిమాలోకి మొగులయ్య అనే గొప్ప కళాకారుడు రావడానికి డైరెక్టర్ సాగర్ చంద్ర కారణమని త్రివిక్రమ్ తెలిపారు. "భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సమయంలో యూట్యూబ్ లో మొగులయ్య వీడియో ఒకటి చూపించిన సాగర్.. ఈ సాంగ్ అలాంటి లీడ్ పెడదామని అన్నాడు. అలా మొగులయ్య గారిని తీసుకొచ్చి పాడించాము. ఆయనకు పద్మశ్రీ రావడం సంతోషంగా ఉంది" అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.
![]() |
![]() |