![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో 'జై తెలంగాణ.. జై ఆంధ్రా.. జై భారత్' అంటూ స్పీచ్ స్టార్ట్ చేసిన పవన్ తనదైన శైలిలో స్పీచ్ అదరగొట్టారు.
"నేను రామ్ భాయ్ అని పిలిచే సోదరుడు కల్వకుంట్ల తారక్ రామారావు(కేటీఆర్) గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇమడవు. కళాకారులు కలిసే ప్రాంతమిది. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం పట్టదు. చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమ ఎంతోమంది పెద్దల కృషితో హైదరాబాద్ కి వచ్చింది. తెలుగు పరిశ్రమకి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అందిస్తున్న తోడ్పాటుకి పరిశ్రమ తరపున హృదయపూర్వక కృతఙ్ఞతలు." తెలిపారు పవన్.
"జన జీవితం ఉన్నా కానీ సినిమా అనేది నాకు అన్నం పెట్టింది. సినిమా లేకపోతే నేను ప్రజల సేవలో ఉండే పరిస్థితి ఉండేది కాదు. సినిమా అనేది నాకిచ్చిన బిక్ష ఇంతమంది అభిమానం. ఇంతమంది గుండెల్లో పెట్టుకున్నందుకు ఎంతో అయిపోతానని కాదు గానీ ఎంతో కొంత చేయాలి మన దేశానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రాలకి, మన వాళ్ళకి. సినిమా తప్ప నాకు వేరే వృత్తి తెలీదు. సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. రాజకీయాల్లో ఉన్నా కదా అని ఏదో తేలికగా తీసుకోకుండా.. తొలిప్రేమ, ఖుషి వంటి సినిమాలను ఎంత బాధ్యతగా చేశామో ఈ సినిమా కూడా అంతే బాధ్యతగా చేశాము." అని అన్నారు.
"నల్గొండకు చెందిన తెలంగాణ యువకుడు సాగర్ గారు.. ఎక్కడో యూఎస్ లో చదువుకుంటూ సినిమా మీద ప్యాషన్ తో వచ్చి ఈరోజు తెలుగు సినీ పరిశ్రమలో బలమైన దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్న ఆయనకు ధన్యవాదాలు. మొగిలయ్య గారు లాంటి కళాకారులు ఈ సినిమాకి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధం ఇది. ఈ మలయాళ రీమేక్ సినిమాకి అద్భుతమైన రచన చేసిన త్రివిక్రమ్ గారి కృతఙ్ఞతలు. ఈ సినిమాకి ఆయన వెన్నుముక. ఆయన లేకపోతే సినిమా లేదు. ఆయన ముందుండి నడిపించారు. అలాగే డేనియల్ శేఖర్ గా రానా గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమా మీకు నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నాము" అంటూ పవన్ స్పీచ్ ముగించారు.
![]() |
![]() |