![]() |
![]() |

భీమ్లా నాయక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణితో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ డ్రమ్స్ వాయించారు. అంతేకాదు వారితో కలిసి పవన్ కళ్యాణ్ కూడా డ్రమ్స్ వాయించడం విశేషం.
హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శివమణి మ్యూజిక్ తో(డ్రమ్స్ వాయిస్తూ) కేటీఆర్, పవన్ ని వేదిక మీదకి సాధరంగా ఆహ్వాహించారు. ఈ సందర్భంగా తమన్, శివమణి కోరిక మేరకు కేటీఆర్, పవన్ డ్రమ్స్ వాయించారు. శివమణి డ్రమ్స్ కొట్టి చూపించగా, కేటీఆర్ కూడా అలాగే కొట్టారు. అదే సమయంలో తమన్ డ్రమ్స్ కొట్టగా, ఆ బీట్ కి తగ్గట్లు పవన్ కూడా డ్రమ్స్ వాయించారు. ఈ దృశ్యం ఫ్యాన్స్ కి కన్నుల పండుగ అని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకుడు.
![]() |
![]() |