![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటించాడు. ఈ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. తాజాగా ఈ సినిమాకి నైజాంలో ఐదో షోకి అనుమతి వచ్చింది. దీంతో ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో భీమ్లా నాయక్ కి కష్టాలు ఎదురవుతుంటే, తెలంగాణలో మాత్రం అన్నీ అనుకూలంగా మారుతున్నాయి. ఏపీలో టికెట్ ధరలు తక్కువ ఉండటంతో అక్కడ సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ అఖండ, పుష్ప సినిమాలు విడుదలై ఘన విజయం సాధించాయి. పవన్ కళ్యాణ్ కూడా తగ్గేదేలే అంటూ భీమ్లా నాయక్ ని విడుదల చేస్తున్నాడు. టికెట్ ధరలపై కొత్త జీవో ఇస్తామన్న ఏపీ ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోగా, "టికెట్ రేట్లు ప్రభుత్వ నిభందనల మేరకు ఉండాలి. బెన్ ఫిట్ షో వేస్తే కఠిన చర్యలు తప్పవు" అంటూ హెచ్చరిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం భీమ్లా నాయక్ కి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి.

తెలంగాణలో భీమ్లా నాయక్ ఐదో షోకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లా అండ్ ఆర్డర్, భారీ రద్దీ కంట్రోల్ కి, బ్లాక్ టికెట్ల మార్కెట్ కి అడ్డుకట్ట వేయడం కోసం ఐదో షోకి అనుమతి ఇవ్వాలని భీమ్లా నాయక్ నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు భీమ్లా నాయక్ ఐదు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉంటే, భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావడం విశేషం.
![]() |
![]() |