![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజవుతోంది. రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, సముద్రకని, మురళీశర్మ, రావు రమేశ్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఫిబ్రవరి 21న మేకర్స్ రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ ట్రైలర్‌కు ఇప్పటివరకూ 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నిజానికి మరింత బాగా ట్రైలర్‌కు దక్కుతుందని ఆశించినా, దాన్ని ఎడిట్ చేసిన విధానానికి మిశ్రమ స్పందన వచ్చింది. రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్లు ట్రైలర్‌లో రానా హీరోలా కనిపిస్తున్నాడని, 'భీమ్లా నాయక్' అనే కంటే 'డానియల్ శేఖర్' అని సినిమాకు టైటిల్ పెడితే బాగుండేదనీ సెటైర్లు వేశాడు.
ఆ సంగతి అలా ఉంచితే బాబాయ్ మూవీ ట్రైలర్‌ను అబ్బాయ్ రామ్‌చరణ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. "భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫైయింగ్!! పవన్ కల్యాణ్ గారి ప్రతి డైలాగ్ అండ్ యాక్షన్ పవర్‌ఫుల్. నా ఫ్రెండ్ రానా దగ్గుబాటి పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ టాప్ నాచ్." అంటూ ట్వీట్ చేశాడు. ఫిబ్రవరి 25న రిలీజవుతున్న మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్పాడు.

త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన 'భీమ్లా నాయక్'కు తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్‌గా భావిస్తున్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మలయాళం హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అయిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
![]() |
![]() |