![]() |
![]() |

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మహర్షి రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు రాఘవ. 170 కి పైగా సినిమాలలో నటించిన ఆయన, పలు సీరియల్స్ లో నటించి బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు.
కమలమ్మ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు గురువారం నాడు హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
![]() |
![]() |