![]() |
![]() |

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి జగపతి పిక్చర్స్ సంస్థతో మంచి అనుబంధమే ఉంది. జగపతి సంస్థలో అత్యధిక చిత్రాలు చేసిన కథానాయకుడిగా ఏయన్నార్ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాంటి ఈ కాంబినేషన్ లో రూపొందిన మొదటి సినిమా `ఆరాధన`. బెంగాలీ చిత్రం `సాగరిక` (1956) ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో ఏయన్నార్ కి జోడీగా `మహానటి` సావిత్రి నటించగా జగ్గయ్య, గిరిజ, రేలంగి, గుమ్మడి, నాగయ్య, రమణా రెడ్డి, రాజశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎల్. విజయలక్ష్మీ ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేశారు. ప్రముఖ దర్శకుడు వి. మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రంగారావుతో కలిసి నిర్మించారు `జగపతి` సంస్థ అధినేత వీబీ రాజేంద్ర ప్రసాద్.
Also Read: బిగ్ బాస్ ఎఫెక్ట్.. భర్తతో విడాకులు ప్రకటించిన రాఖీ సావంత్!
ఎస్. రాజేశ్వరరావు సంగీతమందించిన ఈ చిత్రానికి శ్రీ శ్రీ, ఆరుద్ర, కొసరాజు, నార్ల చిరంజీవి సాహిత్యమందించారు. ఇందులోని ``నా హృదయంలో నిదురించే చెలి`` ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలవగా.. ``వెన్నెలలోని వికాసమే``, ``ఇంగ్లీషులోన మ్యారేజీ``, ``నీ చెలిమి``, ``ఆడదాని ఓరచూపులో``, ``ఓహోహో మామయ్య``, ``ఏమంట ఏమంట`` గీతాలు కూడా రంజింపజేశాయి. 1962 ఫిబ్రవరి 16న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `ఆరాధన`.. నేటితో 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
కాగా, `ఆరాధన` టైటిల్ తోనే 1976లో నటరత్న ఎన్టీఆర్, 1987లో మెగాస్టార్ చిరంజీవి వేర్వేరు కథాంశాలతో సినిమాలు చేయడం.. అవి కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలవడం విశేషం.
![]() |
![]() |