![]() |
![]() |

ఇటీవల 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పటికే 'అంటే సుందరానికీ' సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సమ్మర్ లో సుందరంగా అలరించనున్న నాని.. త్వరలో మరో మూవీ షూటింగ్ తో బిజీ కానున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న 'దసరా' మూవీ తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది.

'నేను లోకల్' తర్వాత నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా బుధవారం ప్రారంభమైంది. మూవీ టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో డైరెక్టర్ కిషోర్ తిరుమల మూవీ టీమ్ కి స్క్రిప్ట్ ని అందజేశాడు.

'దసరా' మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.
![]() |
![]() |