![]() |
![]() |

మూవీ మొఘల్ డి. రామానాయుడు.. పలువురు దర్శకులకు తొలి అవకాశమిచ్చారు. వారిలో బోయిన సుబ్బారావు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా విజయసురేశ్ కంబైన్స్ పతాకంపై రామానాయుడు నిర్మించిన `సావాసగాళ్ళు` చిత్రం కోసం బోయిన సుబ్బారావు తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఆపై నాయుడు నిర్మాణంలో పలు సినిమాలను తెరకెక్కించారాయన.
కృష్ణకి జోడీగా జయచిత్ర నటించిన `సావాసగాళ్ళు`లో గుమ్మడి, గిరిబాబు, ప్రభ, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నగేశ్, రమాప్రభ, గిరిజ, రావి కొండలరావు, రాధాకుమారి, కల్పనా రాయ్, మమత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. బాల మురుగన్ కథను అందించిన ఈ సినిమాకి మోదుకూరి జాన్సన్ సంభాషణలు సమకూర్చారు.
Also Read: ఆమె 'నెహ్రూ'కి అమ్మాయిలను సప్లై చేసింది.. కంగనా సంచలన వ్యాఖ్యలు!
జేవీ రాఘవులు సంగీతమందించిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ, కొసరాజు, అప్పలాచార్య సాహిత్యమందించారు. ఇందులోని ``ఆనందమానందమాయేనే అందాల బొమ్మకు సిగ్గాయేనే``, ``కుచ్చిళ్ళు చీరాడు కోకకట్టి``, ``బంగారు తల్లివి నీవమ్మా``, ``ఈ లోకం ఒక నాటక రంగం``, ``గోంగూరకి`` అంటూ సాగే గీతాలు ప్రజాదరణ పొందాయి. 1977 ఫిబ్రవరి 16న విడుదలై జననీరాజనాలు అందుకున్న `సావాసగాళ్ళు`.. నేటితో 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |