![]() |
![]() |
.webp)
గత ఏడాది ఆరంభంలో విడుదలైన `మాస్టర్`, `ఉప్పెన` చిత్రాల్లో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న `విక్రమ్` సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడీ వెర్సటైల్ స్టార్.
Also Read: మాల్దీవుల్లో బికినీతో కేకపుట్టిస్తున్న కత్రినా! విక్కీ ఎక్కడ?
ఇదిలా ఉంటే, త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో బ్యాడీగా కనిపించబోతున్నాడట విజయ్ సేతుపతి. ఆ వివరాల్లోకి వెళితే.. `కుకూ`, `జోకర్`, `జిప్సీ` వంటి తమిళ చిత్రాలను రూపొందించిన రాజు మురుగన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ కార్తి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో విలన్ రోల్ లో ఎంటర్టైన్ చేయబోతున్నాడట విజయ్ సేతుపతి. అదే గనుక నిజమైతే.. 2010లో విడుదలైన `నాన్ మహాన్ అల్ల` ( తెలుగులో `నా పేరు శివ`) తరువాత కార్తి, విజయ్ కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. `నాన్ మహాన్ అల్ల`లో కార్తికి స్నేహితుడిగా చిన్న పాత్రలో కనిపించాడు విజయ్ సేతుపతి. మరి.. 12 ఏళ్ళ క్రితం కార్తికి ఫ్రెండ్ గా అలరించిన విజయ్ సేతుపతి.. ఈ సారి ప్రతినాయకుడిగానూ మెప్పిస్తాడేమో చూడాలి. త్వరలోనే కార్తి - రాజు మురుగన్ కాంబినేషన్ మూవీలో విజయ్ సేతుపతి ఎంట్రీపై క్లారిటీ రానుంది.
![]() |
![]() |