![]() |
![]() |

`ఆర్య`, `కుమారి 21 ఎఫ్`, `ఖైదీ నంబర్ 150`, `రంగస్థలం`, `సైరా నరసింహారెడ్డి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగునాట ఛాయాగ్రహకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఆర్. రత్నవేలు. స్వతహాగా తమిళయన్ అయిన రత్నవేలు.. తన మాతృభాషలోనే ఎక్కువ సినిమాలు చేశారు. వాటిలో సింహభాగం వెర్సటైల్ స్టార్ సూర్యతోనే చేశారాయన. సూర్య కెరీర్ ని కీలక మలుపు తిప్పిన `నంద`తో పాటు `సందిప్పోమా`, `పేరళగన్`, `మయావి`, `వారణమ్ ఆయిరమ్` వంటి చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. వీటిలో `నంద`, `వారణమ్ ఆయిరమ్` మంచి విజయం సాధించాయి.
Also Read: విజయ్‌తో పూరి 'జన గణ మన'!
కట్ చేస్తే.. దాదాపు 14 ఏళ్ళ తరువాత వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తోంది. ఆ చిత్రమే.. `ఎదర్కుమ్ తుణిందవన్`. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనూ `ఈటీ` పేరుతో అనువాద రూపంలో ఎంటర్టైన్ చేయనుంది. మరి.. లాంగ్ గ్యాప్ తరువాత సూర్య, రత్నవేలు కాంబోలో వస్తున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, మార్చి 10న `ఎదర్కుమ్ తుణిందవన్` థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
![]() |
![]() |