![]() |
![]() |

మహేశ్‌బాబు 'సర్కారువారి' పాట సినిమాలో 'కళావతి' సాంగ్ షెడ్యూల్ కంటే ముందుగా ఆన్‌లైన్‌లో లీకవడం కలవరం సృష్టించింది. దాంతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్న ఆ పాటను ఒక రోజు ముందుగానే మేకర్స్ రిలీజ్ చేశారు. అయినప్పటికీ 'కళావతి' అఫిషియల్ సాంగ్‌కు యూట్యూబ్‌లో అత్యధిక సంఖ్యలో వ్యూస్ లభిస్తున్నాయి. ఆ లీక్ సంగతి ఇంకా జనం నోళ్లలో నానుతుండగానే, మరో సినిమా సాంగ్ బిట్ ఆన్‌లైన్‌లో లీకై నిర్మాతలకు షాక్ ఇచ్చింది.
నిన్న 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ లోడింగ్ అంటూ నిర్మాతలు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. అంతలోనే ఆ పాటకు సంబంధించిన ఒక డాన్స్ బిట్ ఇంటర్నెట్‌లో లీకు రూపంలో ప్రత్యక్షమైంది. వెంటనే అది వైరల్‌గా మారింది. దీంతో నిర్మాతలు ఖంగుతిన్నారు. 'భీమ్లా నాయక్' సాంగ్ బిట్ లీకుపై పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అఫిషియల్ సాంగ్ కోసం వారు క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా లీకులవుతుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
మలయాళం హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అయిన 'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రధారులు కాగా, రావు రమేశ్, సముద్రకని, మురళీశర్మ, రఘుబాబు ఇతర కీలక పాత్రధారులు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ రాసిన ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకుడు.
![]() |
![]() |