![]() |
![]() |

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న 'ఎఫ్ 3' మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. గతంలో ఏప్రిల్ 28న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాతలు, ఇప్పుడు ఆ విడుదల తేదీని మే 27కు మార్చారు. అయితే అదేరోజున మరో రెండు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో ఒకే రోజున మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
.webp)
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మేజర్'. పాండెమిక్ కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 27 న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అలాగే మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'రంగ రంగ వైభవంగా' కూడా మే 27 నే విడుదల కానుంది. రీసెంట్ గా ఈ మూవీ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పుడు అదే డేట్ కి రావడానికి 'ఎఫ్ 3' రెడీ అవుతోంది. ఈ మేరకు మే 27న 'ఎఫ్ 3' సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మరోవైపు మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మే 12 న విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన రెండు వారాలకు మే 27న ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ త్రిముఖ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

![]() |
![]() |