![]() |
![]() |

తమిళనాట అగ్ర సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఈ స్టార్ కంపోజర్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. విశేషమేమిటంటే.. వాటిలో నాలుగు చిత్రాలు వేసవిలో సందడి చేయనున్నాయి. అవన్నీ కూడా ఇక్కడ అనువాద రూపంలో విడుదయ్యే అవకాశముంది.
ఆ వివరాల్లోకి వెళితే.. యువ కథానాయకుడు శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన `డాన్` సమ్మర్ స్పెషల్ గా మార్చి 25న రిలీజ్ కానుండగా.. ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన `బీస్ట్` కూడా వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న `విక్రమ్` కూడా సమ్మర్ సీజన్ లో వినోదాలు పంచనుంది. ఇక విజయ్ సేతుపతి, నయనతార, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరి `కాత్తు వాక్కల్ రెండు కాదల్` కూడా మండు వేసవిలో విడుదల కానుంది. ఏప్రిల్ 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రాబోతోంది.
Also Read: 'ఘోస్ట్‌బస్టర్స్' డైరెక్టర్ ఇవాన్ రీట్‌మ్యాన్ మృతి
మొత్తంగా.. ఈ వేసవిలో తమిళనాట అనిరుధ్ హవా ఉండబోతోందన్నమాట. మరి.. ఈ నాలుగు చిత్రాల్లో వేటికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |