![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. 2007లో విడుదలైన `తులసి` కోసం ఈ ఇద్దరు మొదటిసారిగా జట్టుకట్టారు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సదరు సినిమా.. బాక్సాఫీస్ ముంగిట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆపై వీరి కలయికలో `నమో వెంకటేశ`(2010), `ఎఫ్ 2` (2019) చిత్రాలు వచ్చాయి. వీటిలో `నమో వెంకటేశ` చెప్పుకోదగ్గ విజయం సాధించగా.. `ఎఫ్ 2` సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మొత్తంగా.. వెంకీ - డీఎస్పీ జట్టుకట్టిన ప్రతీసారి హిట్టుకొట్టారనే చెప్పాలి.
కట్ చేస్తే.. మూడేళ్ల విరామం అనంతరం ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ లో మరో మూవీ వస్తోంది. ఆ సినిమానే.. `ఎఫ్ 3`. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవి కానుకగా ఏప్రిల్ 28న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. గత మూడు సందర్భాల్లో వేసవేతర సీజన్స్ లోనే పలకరించిన ఈ కాంబో.. ఈ సారి సమ్మర్ సీజన్ లో కూడా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
Also Read: రష్మికకి అతనితో హ్యాట్రిక్ దక్కేనా!
కాగా, `ఎఫ్ 3`లో వెంకీతో పాటు వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై `దిల్` రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
![]() |
![]() |