![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భీమ్లా నాయక్'. జనవరి 12 న విడుదల కావాల్సిన ఈ మూవీ ఫిబ్రవరి 25 కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ తేదీకి కూడా 'భీమ్లా నాయక్' విడుదల కావడం కష్టమేనని న్యూస్ వినిపిస్తోంది.
కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన పలు సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటించింది. అయితే భీమ్లా నాయక్ ని మాత్రం ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న విడుదల చేస్తామంటూ మూవీ టీమ్ రెండు తేదీలు ప్రకటించింది. అదే బాటలో వరుణ్ తేజ్ నటించిన 'గని' కూడా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 అంటూ రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 25 న గని విడుదల కానుందని, 'భీమ్లా నాయక్' మళ్లీ వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి.

'గని' నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని మూవీ టీమ్ తెలిపింది. రిలీజ్ డేట్ కూడా లాక్ అయిందని, త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. అందుకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25 నే గని వస్తుందని తెలుస్తోంది. 'భీమ్లా నాయక్' వెనక్కి వెళ్లడంతోనే గని టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
![]() |
![]() |