![]() |
![]() |

ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అగ్ర కథానాయకుల్లో నటభూషణ శోభన్ బాబు ఒకరు. శోభన్ నటించిన కుటుంబ కథా చిత్రాల్లో `వంశ గౌరవం` ఒకటి. ఎన్. రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభినయ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జాగర్లమూడి ఆదినారాయణ రావు, రావి ఆంజనేయులు సంయుక్తంగా నిర్మించారు. శోభన్ బాబు కి జోడీగా సుజాత, కూతుళ్ళుగా విజయశాంతి, గీత నటించిన ఈ సినిమాలో భాను చందర్, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, జేవీ రమణమూర్తి, రాజా, గిరిజా రాణి, మల్లికార్జున రావు, డబ్బింగ్ జానకి, బేబీ జయశాంతి, బేబి బబిత, బేబి వందన, బేబి సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో అభినయించారు. ఎ. పద్మనాభం మూలకథను అందించిన ఈ చిత్రానికి హాస్యబ్రహ్మ జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.
Also Read: ఆకట్టుకుంటున్న పునీత్ చివరి సినిమా 'జేమ్స్' టీజర్!
అగ్ర స్వరకర్త చక్రవర్తి సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలకు దిగ్గజ పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని ``పాలు కావాలా? పండు కావాలా?`` (రెండు వెర్షన్స్), ``నా శశి నీవేనా!``, ``ఎక్కడో దూరానా ఉన్నా``, ``నీ మోవి సోకనీరా``.. వంటి పాటలు ఆకట్టుకున్నాయి. 1982 ఫిబ్రవరి 12న విడుదలైన `వంశ గౌరవం`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |