![]() |
![]() |

తమిళ స్టార్ యాక్టర్ విశాల్ తన తదుపరి చిత్రం 'లాఠీ' షూటింగ్‌లో గాయపడ్డాడు. హైదరాబాద్‌లో స్టంట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆయనకు పలు ఫ్రాక్చర్ అయ్యాయి. అందిన సమాచారం ప్రకారం ఆయన చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకోవడం కోసం మూడు వారాలు గడిపేందుకు కేరళ వెళ్తున్నాడు. విశాల్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత 'లాఠీ' తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
తను గాయపడిన స్టంట్ సీన్‌కు సంబంధించిన ఒక వీడియోను విశాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఆ వీడియోలో, ఒక భారీ రన్నింగ్ యాక్షన్‌తో విశాల్ పాల్గొన్న ఆ సీన్ ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. ఆ వీడియోను షేర్ చేస్తూ, "#లాఠీ లో ఈ స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో అనేక హెయిర్‌లైన్ ఫ్రాక్చర్లకు గురయ్యాను. నన్ను నేను స్వాంతన చేకూర్చుకోవడం కోసం కేరళకు బయలుదేరాను! 2022 మార్చి మొదటి వారం నుండి చివరి షెడ్యూల్ కోసం టీమ్‌తో జాయిన్ అవుతాను." అని రాసుకొచ్చాడు విశాల్.
సునయన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎ. వినోద్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తుండగా, ఎం. బాలసుబ్రమణ్యమ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
ఇంతకుముందు విశాల్ నటించిన 'సామాన్యుడు' సినిమా ఫిబ్రవరి 4న విడుదలై, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను ఎదుర్కొంది.
![]() |
![]() |