
తెలుగునాట నటించింది తక్కువ చిత్రాల్లోనైనా.. కథానాయికగా మంచి క్రేజ్ నే మూటగట్టుకుంది రష్మికా మందన్న. `ఛలో`, `గీత గోవిందం`, `దేవదాస్`, `డియర్ కామ్రేడ్`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప - ద రూల్`.. ఇలా ఇప్పటివరకు ఏడు తెలుగు సినిమాల్లో సందడి చేసింది రష్మిక. వీటిలో `ఛలో`, `గీత గోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప - ద రూల్` మంచి విజయం సాధించాయి. త్వరలో ఈ ముద్దుగుమ్మ నటించిన `ఆడవాళ్ళు మీకు జోహార్లు` థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది.
Also Read: 'కాదు వాకుల రెండు కాదల్' టీజర్ వస్తోంది
ఇదిలా ఉంటే.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రష్మిక ఇంతవరకు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముంగిట కాసుల వర్షం కురిపించాయి. `సరిలేరు నీకెవ్వరు`, `పుష్ప - ద రూల్`.. ఇలా రష్మిక, డీఎస్పీ కాంబోలో వచ్చిన చిత్రాలు విజయపథంలో పయనించాయి. మరి.. దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాక్టర్ మరోసారి కలిసొచ్చి.. `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తో అమ్మడి ఖాతాలో మరో సక్సెస్ యాడ్ అవుతుందేమో చూడాలి. అలాగే డీఎస్పీ కాంబోలో రష్మిక హ్యాట్రిక్ చూస్తుందా? అన్నది కూడా ఆసక్తికరమే.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్.. చివరికి ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు!
కాగా, కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన `ఆడవాళ్ళు మీకు జోహార్లు`లో రాధిక, ఖుష్బూ, ఊర్వశి ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ ఆకట్టుకోవడంతో.. సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.






