![]() |
![]() |

కథానాయకుడిగా మాస్ మహారాజా రవితేజ ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా తన దర్శకులతో పదే పదే సినిమాలు చేశారాయన. పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి, పరశురామ్.. ఇలా ఆ దర్శకుల జాబితా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. తాజాగా `ఖిలాడి`తో రమేశ్ వర్మ కూడా ఈ లిస్ట్ లో చేరారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పూరి, శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో ఫస్ట్ కాంబినేషన్ లోనే సక్సెస్ చూశారు రవితేజ. దీంతో.. వీరి కాంబోల్లో మళ్ళీ మళ్ళీ సినిమాలు వచ్చాయి. పరశురామ్ విషయానికి వస్తే.. ఫస్ట్ కాంబో ఫిల్మ్ `ఆంజనేయులు` ఎబౌవ్ యావరేజ్ కాగా, ఆపై వచ్చిన `సారొచ్చారు` ఆశించిన విజయం సాధించలేదు. ఇక హరీశ్ శంకర్ సంగతి తీసుకుంటే.. `షాక్`తో తనకి దర్శకుడిగా తొలి అవకాశమిచ్చారు రవితేజ. ఆ సినిమా నిరాశపరిచినా, సెకండ్ టైమ్ వచ్చిన `మిరపకాయ్` విజయపథంలో పయనించింది.
కట్ చేస్తే.. `వీర` వంటి ఫ్లాప్ మూవీ తరువాత రమేశ్ వర్మతో మరోసారి ఇప్పుడు `ఖిలాడి` చేశారు రవితేజ. మరి.. హరీశ్ శంకర్ ఎలాగైతే సెకండ్ కాంబినేషన్ లో రవితేజతో హిట్ చూశారో.. అలాగే రమేశ్ వర్మ కూడా మాస్ మహారాజాతో సెకండ్ జాయింట్ వెంచర్ తోనైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, రేపు (ఫిబ్రవరి 11) `ఖిలాడి` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |