![]() |
![]() |

సినిమా టికెట్ ధరల వివాదం, ఇతర సమస్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో పాల్గొన్న ప్రముఖుల్లో మహేశ్‌బాబు, ప్రభాస్, ఆర్. నారాయణమూర్తి, యస్.యస్. రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని కృష్ణమురళి ఉన్నారు. నిజానికి వీరితో పాటు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని నిన్న వినిపించింది. కానీ ఆ ఇద్దరూ జగన్‌తో భేటీకి హాజరు కాలేదు. Also read: మహేష్ కి మెగాస్టార్ స్పెషల్ విషెస్!
భార్య అమల కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నాగార్జున మీటింగ్‌కు వెళ్లలేకపోయారు. చివరి నిమిషంలో జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య కారణాలతో తప్పుకున్నారు. అయితే తను ఈ భేటికి వెళ్తే రాజకీయ వివాదం తలెత్తే అవకాశం ఉందని భావించడం వల్లే తారక్ విజయవాడ వెళ్లలేదని అంటున్నారు. Also read: సీఎంతో భేటీ ముగిసింది.. శుభం కార్డు పడిందంటున్న మెగాస్టార్!
టీడీపీ నాయకులు మొదట్నుంచీ తారక్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు. నందమూరి కుటుంబ సభ్యులపై వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నా, బూతులు తిడుతున్నా జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారనీ, వై.ఎస్. జగన్‌పైనా, ఆయన ప్రభుత్వంపైనా ఎలాంటి విమర్శలూ చేయట్లేదనీ వారు తారక్‌ను తప్పుపడుతూ వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పాలని తారక్‌పై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తున్నా, ఆయన మాత్రం రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య కారణాలతో జగన్‌తో భేటీకి డుమ్మా కొట్టారు.
![]() |
![]() |