![]() |
![]() |

పబ్లిసిటీ డిజైనర్ గా కెరీర్ ని ప్రారంభించిన రమేశ్ వర్మ.. ఆనక తరుణ్ హీరోగా నటించిన `ఒక ఊరిలో` (2005)తో దర్శకుడి అవతారమెత్తాడు. ఆపై `రైడ్` (2009), `వీర` (2011), `అబ్బాయితో అమ్మాయి` (2016), `రాక్షసుడు` (2019) వంటి సినిమాలు తీశాడు. వీటిలో `రైడ్`, `రాక్షసుడు` సినిమాలు చెప్పుకోదగ్గ విజయాలు సాధించగా.. మిగిలినవన్నీ నిరాశపరిచాయి. కట్ చేస్తే.. ఇప్పుడు `ఖిలాడి` కోసం ఆరోసారి మెగాఫోన్ పట్టారు రమేశ్ వర్మ. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. రేపు (ఫిబ్రవరి 11) జనం ముందుకు రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `ఖిలాడి` ముందువరకు రమేశ్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా వేర్వేరు సంగీత దర్శకుల కాంబినేషన్ లోనే వచ్చాయి. `ఒక ఊరిలో`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. `రైడ్`కి హేమచంద్ర, `వీర`కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్, `అబ్బాయితో అమ్మాయి`కి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, `రాక్షసుడు`కి జిబ్రాన్ స్వరాలు సమకూర్చారు. కాగా, ఇప్పుడు వస్తున్న `ఖిలాడి`కి మాత్రం తన ఫస్ట్ ఫిల్మ్ కంపోజర్ దేవిశ్రీ మరోసారి సంగీతమందించారు. మరి.. రాక్ స్టార్ కాంబోలో ఫస్ట్ టైమ్ సక్సెస్ అందుకోలేకపోయిన రమేశ్ వర్మ.. రెండోసారి చేసిన `ఖిలాడి`తోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.
![]() |
![]() |