![]() |
![]() |

తెలుగునాట అభిరుచి గల నిర్మాణ సంస్థగా ప్రత్యేక గుర్తింపు పొందింది.. ఈతరం ఫిల్మ్స్. ఈ బేనర్ పై పోకూరి బాబురావు నిర్మించిన పలు చిత్రాలు మంచి విజయం సాధించాయి. వాటిలో `రణం` ఒకటి. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతోనే నృత్య దర్శకుడు `అమ్మ` రాజశేఖర్ దర్శకుడిగా తొలి అడుగేశారు. ఇందులో గోపీచంద్ కి జోడీగా కామ్నా జెఠ్మలాని నటించగా బిజు మీనన్, చంద్రమోహన్, అలీ, రమాప్రభ, వేణు మాధవ్, సుమన్ శెట్టి, ధర్మవరపు సుబ్రమణ్యం, పృథ్వీరాజ్, జీవీ సుధాకర్ నాయుడు, జీవా, టార్జాన్, జాహ్నవి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
Also Read: అర్జున్ నాకు ఫుడ్ పంపేవారు!
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన ఈ చిత్రానికి చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, భాషశ్రీ, కందికొండ సాహిత్యమందించారు. ``బుల్లిగౌను``, ``చెలి జాబిలి``, ``నల్లని మబ్బుల``, ``వారెవ్వా``, ``హే చిన్నా``, ``గణ గణ``.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. 24 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న `రణం`.. ఒరియాలో `మహానాయక్`, కన్నడలో `భద్ర` పేర్లతో రీమేక్ అయింది. 2006 ఫిబ్రవరి 10న విడుదలై జననీరాజనాలు అందుకున్న `రణం`.. నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |