![]() |
![]() |

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన కథానాయికల్లో నేహా శెట్టి ఒకరు. తన తనయుడు ఆకాశ్ హీరోగా పూరి రూపొందించిన `మెహబూబా` (2018)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహ. అంతేకాదు.. మొదటి సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో అభినయించి మురిపించింది. అయితే, సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. ఆపై సందీప్ కిషన్ కి జోడీగా `గల్లీ రౌడీ` (2021)లో కనిపించిన నేహకి.. ఆ సినిమా కూడా నిరాశజనక ఫలితాన్నే అందించింది. అనంతరం అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` (2021) కోసం కీలక పాత్రలో కనిపించి.. ఓ హిట్ ఫిల్మ్ లో భాగమైంది.
కాగా, ఈ శనివారం (ఫిబ్రవరి 12) విడుదలవుతున్న `డీజే టిల్లు`తో మరోమారు సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేయబోతోంది నేహ. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో మోడ్రన్ గాళ్ గా సందడి చేయనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. మరి.. సహాయక నటిగానే తొలి విజయాన్ని చూసిన నేహా శెట్టి.. `డీజే టిల్లు`తోనైనా హీరోయిన్ గా తెలుగునాట ఫస్ట్ సక్సెస్ స్కోర్ చేస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే.. `డీజే టిల్లు`తో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఓ డెబ్యూ డైరెక్టర్ తో నేహా శెట్టి చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
![]() |
![]() |