![]() |
![]() |

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాతో హీరోగా అఖిల్ మొదటి హిట్ అందుకోవడంతో పాటు.. డైరెక్టర్ భాస్కర్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఓటీటీ వేదిక ఆహాలో ఈ నెల 19 నుంచి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఆహాలో విడుదలైన 2 రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తాజాగా మేకర్స్ పంచుకున్నారు.

జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా పూజ హెగ్డే నటించింది. గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
![]() |
![]() |