![]() |
![]() |

ఆల్‌మోస్ట్ ఆరేళ్ల గ్యాప్‌తో టాలీవుడ్‌లో 'అమర్ అక్బర్ ఆంటోని' మూవీతో రి-ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. రవితేజతో నటించిన 'దేవుడు చేసిన మనుషులు' (2012) సినిమా తర్వాత 'బర్ఫీ' మూవీతో బాలీవుడ్‌కు వెళ్లిపోయిన ఆమె తెలుగులో మళ్లీ రవితేజ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోని'లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా 2018లో వచ్చింది. దాని తర్వాత మళ్లీ ఇంతదాకా ఏ తెలుగు సినిమాకూ ఆమె సంతకం చేయలేదు. అలా అని బాలీవుడ్‌లోనూ ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. రణదీప్ హూడాతో కలిసి నటించిన 'తేరా క్యా హోగా లవ్లీ' మూవీ విడుదల కావాల్సి వుంది.
కాగా తెలుగులో ఆమె తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్న ఏకైక చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోని'. "సాధారణంగా నేను నా సినిమా అగ్రిమెంట్‌లో డబ్బింగ్ చెప్తానని ఒప్పుకోను. కానీ ఆ నియమాన్ని దాటి డబ్బింగ్ చెప్పానంటే కారణం డైరెక్టర్ శ్రీను వైట్ల. సినిమా ఒప్పుకున్న తర్వాత మీరే డబ్బింగ్ చెప్పాలని ఆయన అన్నారు. ముందు ఆయన జోక్ చేస్తున్నారనుకున్నా. కానీ ఆయన నా డబ్బింగ్ విషయంలో సీరియస్‌గా వున్నారని తెలిసింది." అని చెప్పింది ఇలియానా.
శ్రీను వైట్ల తనపై అంత నమ్మకంగా ఉండటంతో తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి సరేనంది. "డబ్బింగ్ చెప్పే సమయంలో నావల్ల కాదేమోనని భయపడ్డాను. కానీ డైరెక్టర్ నాకు సపోర్ట్‌గా నిలిచారు. మూడు రోజుల్లో నా పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాను. అయితే డబ్బింగ్‌లో నా గొంతు నాకే నచ్చలేదు. ఫ్యూచర్‌లో కూడా ఏ డైరెక్టరైనా మీరు చెబితే బాగుంటుందని చెబితే నేను డబ్బింగ్ చెప్తాను" అని ఆమె చెప్పుకొచ్చింది.
![]() |
![]() |