![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే సినిమా హిందీ రైట్స్ విషయంలో సమస్యలు ఏర్పడ్డాయని, హిందీలో విడుదల అవ్వడం కష్టమని న్యూస్ వినిపించాయి. దీంతో ఫ్యాన్స్ లో నిరాశ ఏర్పడింది. అయితే తాజాగా పుష్ప హిందీ విడుదల విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
పుష్ప హిందీ విడుదల విషయంలో వస్తున్న రూమర్స్ కి తాజాగా మూవీ టీమ్ చెక్ పెట్టింది. పుష్పను హిందీలో 'ఏఏ ఫిల్మ్స్ ఇండియా' అనే సంస్థ విడుదల చేయనుందని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'ఏఏ ఫిల్మ్స్ ఇండియా' గతంలో 'కేజీయఫ్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. తాజాగా ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పుష్పతో నార్త్ లోనూ బన్నీ సత్తా చాటుతాడని భావిస్తున్నారు. అలాగే కర్ణాటక హక్కులను స్వాగత్ అనే సంస్థ తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది వరకే తమిళ, మళయాల హక్కులు అమ్ముడుపోయాయి.

పుష్పలో బన్నీ సరసన రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |