![]() |
![]() |

నవరస నటనా సార్వభౌమగా అభిమానులు ప్రేమగా పిలుచుకొనే కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి, ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఆయనకు జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స జరుగుతోంది. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య స్థితికి సంబంధించి వెలువరించిన హెల్త్ బులిటెన్‌లో "కైకాల సత్యనారాయణ తీవ్రమైన సెప్టిక్ షాక్‌కు గురయ్యారు. ఆయన పలు అవయవాలు ఫెయిల్ అయ్యాయి. ఆయన ఆరోగ్య స్థితిని మెరుగుపర్చడానికి డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఆశించిన మేర చికిత్సకు ఆయన స్పందించడం లేదు" అని తెలిపారు.
లెజెండరీ యాక్టర్ అయిన సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తెలుగు చిత్రసీమలో ఆందోళన నెలకొంది. ఆయనకు స్వస్థత చేకూరాలని అభిమానులు, ఇండస్ట్రీకి సంబంధించిన వారంతా ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయన క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని పోస్టులు పెడుతున్నారు. అక్టోబర్ 30న ఇంట్లో జారిపడిన ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో అపోలో హాస్పిటల్‌కు తరలించారు.

![]() |
![]() |