![]() |
![]() |

తెలుగునాట సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన సినిమాల్లో `అర్జున్ రెడ్డి` ఒకటి. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ దశ, దిశని మార్చివేసిన ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా నిలిచాడు. ఆపై `అర్జున్ రెడ్డి`ని `కబీర్ సింగ్` పేరుతో హిందీలో రీమేక్ చేసి.. అక్కడా విజయకేతనం ఎగురవేశాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ కెప్టెన్ చేతిలో హిందీ చిత్రం `యానిమల్`, ప్రభాస్ 25వ చిత్రం `స్పిరిట్` ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా హ్యాట్రిక్ ఎటెంప్ట్ గా తెరకెక్కుతున్న `యానిమల్`కి సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. 2023 ఆగస్టు 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సందీప్ తొలి చిత్రం `అర్జున్ రెడ్డి` కూడా 2017లో ఇదే ఆగస్టు నెలలో విడుదలైంది. మరి.. రిలీజ్ మంత్ పరంగా `అర్జున్ రెడ్డి` బాటలోనే వెళుతున్న `యానిమల్` కూడా సెన్సేషన్ క్రియేట్ చేసి.. సందీప్ కి వరుసగా మూడో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
కాగా, `యానిమల్`లో అనిల్ కపూర్, రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |