![]() |
![]() |

ఫిబ్రవరి 18.. కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు. ఆ రోజు సోషల్ మీడియాలో అనుపమ అభిమానుల హంగామా మాములుగా ఉండదు. వచ్చే ఏడాది ఈ సందడి మరింత పెరగనుంది. ఎందుకంటే.. ఆ రోజు అనుపమ నటిస్తున్న కొత్త చిత్రం రిలీజ్ కానుంది. ఆ సినిమానే.. `18 పేజెస్`. యంగ్ హీరో నిఖిల్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ దర్శనమివ్వనున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాని.. 2022 ఫిబ్రవరి 18న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అంటే.. అనుపమ బర్త్ డే స్పెషల్ గా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరపైకి రానుందన్నమాట.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు డజనుకి పైగా చిత్రాల్లో నాయికగా నటించిన అనుపమకి.. బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కానున్న మొదటి సినిమా ఇదే కానుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రచన, నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `కుమారి 21 ఎఫ్` ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి.. అనుపమ పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న `18 పేజెస్`.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |