Home

»

Latest News

మంచు కుటుంబంలో విషాదం.. మోహన్ బాబు తమ్ముడు కన్నుమూత!

Nov 17, 2021 5:40PM

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు రంగస్వామి నాయుడు(63) బుధవారం సాయంత్రం కన్నుమూశారు.

తిరుపతిలో నివాసం ఉంటూ వ్యవసాయం చేసే రంగస్వామి గుండెపోటుతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషయమించడంతో బుధవారం సాయంత్రం ఆసుపత్రిలోనే కన్నుమూశారు. మోహన్ బాబు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో రంగస్వామి చురుకుగా పాల్గొనేవారు. ఇప్పుడు ఆయన లేరనే వార్త ఆ కుటుంబంలో విషాదం నింపింది.

రంగస్వామి కన్నుమూయడంతో ఆయన భార్య కాంతమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రంగస్వామి అంత్యక్రియలు రేపు(గురువారం) తిరుపతిలో జరగనున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com