![]() |
![]() |

బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ధారావాహిక `కార్తీక దీపం`. దేశ వ్యాప్తంగా రేటింగ్ పరంగా..., ఆదరణ పరంగా నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ సీరియల్ గత కొంత కాలంగా టాప్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కథనం గాడితప్పి వీక్షకుల విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా బుధవారం కథ మళ్లీ గాడిలోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ బుధవారం 1199 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
మంగళవారం ఎపిసోడ్‌లో ఆదిత్యని కాపాలని పిలిచి మోనిత నిజం చెప్పడంతో కథనం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆవేశానికి లోనైన ఆదిత్య నడీరోడ్డుపై డాక్టర్ బాబుని నిలదీస్తాడు. దీంతో డాక్టర్ బాబు నేను ఏ తప్పు చేయలేదంటాడు. అంతే కాకుండా `మోనితతో కలిసి గుడిలో దోష నివారణ పూజ చేస్తుంటే మీ వదిన మమ్మల్ని చూసింది` అని చెబుతాడు కార్తీక్. ఈ మాటలు విన్నాక ఆదిత్య సైలెంట్ అయిపోతాడు. ఆ తరువాత కార్తీక్ చెప్పిన మాటలకు సమాధానంగా ఇలా అంటాడు.. నిజమో అబద్ధమో వదినకు జరిగింది చెప్పు` అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆదిత్య.
కట్ చేస్తే ... జరుగుతున్న పరిణమాల నేపథ్యంలో నవ్వుతూనే దీప కార్తీక్‌కి చురకలు అంటిస్తుంది. గంభీరంగా వుండే మీరు మారిపోయారత్తయ్యా అంటూ ఇండైరెక్ట్‌గా సెటైర్ వేస్తుంది. ఇక ఇదే సమయంలో ఆదిత్యని కార్తీక్ ముందు కట్టడి చేయడంతో ఆనందరావు ఇంట్లో మోనిత జరుగుతుందని ఊహించిన రచ్చ జరగలేదు. దీంతో తను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటిగా మారింది. అనూహ్య ట్విస్ట్ లతో సాగుతున్న కార్తీక దీపం బుధవారం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెలియాంటే ఓ లుక్కెయ్యాల్సిందే.
![]() |
![]() |