![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'జై భీమ్' మూవీ వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఈ వివాదంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తుండగా.. కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సంతానం మాత్రం 'జై భీమ్'కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కాంట్రవర్సీ మరింత హీట్ ఎక్కింది.
'జై భీమ్' సినిమాలో ఉపయోగించిన వన్నియార్ కమ్యూనిటీ లోగోని తొలగించాలని పీఎంకే నేత, మాజీ మంత్రి అన్బుమణి రామ్ దాస్ డిమాండ్ చేయగా.. సూర్య తొలగించారు. కానీ రామ్ దాస్ అనూహ్యంగా వన్నియార్ కమ్యూనిటీకి సూర్య క్షమాపణలు చెప్పాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇక పీఎంకే నేతలు కొందరైతే.. వన్నియార్ కమ్యూనిటీకి రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని కొందరు, సూర్యని కొట్టినవారికి లక్ష రూపాయలు ఇస్తామని కొందరు వ్యాఖ్యానించి వివాదానికి తెరదీశారు. దీంతో సూర్య అభిమానులు, సినీ ప్రేమికులు #WeStandWithSuriya అంటూ సోషల్ మీడియా వేదికగా సూర్యకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంలోకి సంతానం ఎంటర్ అయ్యారు.
సంతానం నటించిన మూవీ 'సభాపతి' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సంతానాన్ని.. 'జై భీమ్' వివాదం గురించి ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సంతానం 'ఇతరులను కీర్తించేందుకు ఒక వర్గాన్ని చెడుగా చూపించడం సరికాదు' అంటూ జై భీమ్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో సూర్య అభిమానులు సంతానంపై మండిపడుతున్నారు. మరోవైపు పీఎంకే పార్టీ సపోర్టర్స్ మాత్రం సంతానం వ్యాఖ్యలు తమను అనుకూలంగా ఉండటంతో సంతానాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో #SuriyaAgainstVanniyars, #WeStandWithSanthanam అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.
![]() |
![]() |