![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన `గాండీవం` (1994) చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆ చిత్రంలోని పాపులర్ సాంగ్ ``గోరువంక వాలగానే``లో సందడి చేసి ఆకట్టుకున్నారు లాల్. కట్ చేస్తే.. 27 ఏళ్ళ తరువాత ఈ ఇద్దరు స్టార్స్ ఒకే రోజున తమ కొత్త చిత్రాలతో థియేటర్స్ లో పోటాపోటీగా ఎంటర్టైన్ చేయనున్నారు. అది కూడా.. తమ లక్కీ డైరెక్టర్స్ సమేతంగా..
ఆ వివరాల్లోకి వెళితే.. తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత బాలయ్య నటించిన హ్యాట్రిక్ ఎటెంప్ట్ `అఖండ` భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న తెరపైకి రాబోతోంది. ఇక అదే రోజున తన ప్రియతమ నిర్దేశకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ లో మోహన్ లాల్ నటించిన ఎపిక్ హిస్టారికల్ వార్ ఫిల్మ్ `మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ` మలయాళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ అనువాద రూపంలో ఎంటర్టైన్ చేయనుంది. మరి.. లక్కీ డైరెక్టర్స్ సమేతంగా బరిలోకి దిగుతున్న బాలయ్య, మోహన్ లాల్.. ఆయా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
![]() |
![]() |