![]() |
![]() |

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'క్యాలీ ఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సంపూ గత చిత్రాలు 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట'లను గుర్తు చేశాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు.
'క్యాలీ ఫ్లవర్' సినిమాని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. తాజాగా మేకర్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ సంపూ శైలిలో విభిన్నంగా ఉన్నాయి. ఒక పోస్టర్ లో అత్యాచారానికి గురైన మగాడిలా సంపూ ఏడుస్తూ కనిపించాడు. అంతేకాదు ఆ పోస్టర్ పై 'మగాడిదీ శీలమేగా' అని రాసి ఉంది.

గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ బ్యానర్లపై ఆశా జ్యోతి గోగినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రజ్వల్ క్రిష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |