![]() |
![]() |

సూర్య లేటెస్ట్ ఫిల్మ్ 'జై భీమ్' ఇటీవలి కాలంలో వచ్చిన గొప్ప చిత్రంగా విమర్శకులు కొనియాడుతున్నారు. పోలీసు కస్టడీలోకి వెళ్లి మాయమైపోయిన తన భర్త కోసం ఒక గిరిజన మహిళ చేసిన పోరాటానికి అండగా నిలిచిన లాయర్ కథతో టి.జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజై, వీక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. అందువల్లే ఐఎండీబీ రేటింగ్స్‌లో ముందుకు దూసుకుపోయిన ఈ సినిమా హాలీవుడ్ గ్రేట్ ఫిలిమ్స్‌లో ఒకటైన 'షాషంక్ రిడెంప్షన్'ను దాటేసింది. 73 వేల ఓట్లతో ప్రస్తుతం 'జై భీమ్' మూవీ ఐఎండీబీలో 9.6 రేటింగ్‌తో కొనసాగుతోంది. 'షాషంక్ రిడెంప్షన్' 2.3 మిలియన్ ఓట్లతో 9.3 రేటింగ్‌తో ఉంది.
తమిళనాడు హైకోర్టు లాయర్‌గా ఉన్నప్పుడు జస్టిస్ చంద్రు వాదించిన ఓ కేసుకు సంబంధించిన యథార్థ ఘటనల నేపథ్యంతో 'జై భీమ్' సినిమా రూపొందింది. ఫస్టాఫ్‌లో రాజన్న అనే ఒక గిరిజన యువకుడిపై పోలీసులు దొంగతనం నేరంమోపి, కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టడం, సెకండాఫ్‌లో కనిపించకుండా పోయిన రాజన్న కోసం అలమటిస్తున్న భార్య పార్వతి తరపున సూర్య హైకోర్టులో వాదించడం ప్రధానంగా కనిపించే ఈ సినిమా.. న్యాయం కోసం పేదలు.. అందునా సామాజికంగా దిగువ స్థాయిలో ఉండేవారు పడేపాట్లను కళ్లకు కట్టినట్లు హృదయాన్ని వ్యధాభరితం చేసే రీతిలో చిత్రించింది.
'జై భీమ్' మూవీలో సూర్య, లిజోమోల్ జోస్, మణికందన్, ప్రకాశ్‌రాజ్, రాజీష విజయన్, రావు రమేశ్, తమిళ్, ఎం.ఎస్. భాస్కర్, జయప్రకాశ్, సుజాత శివకుమార్ కీలక పాత్రలు పోషించారు.
![]() |
![]() |