![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజకు 'క్రాక్'తో సూపర్ హిట్ ని ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య 107వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా సందడి చేయనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ మూవీ ఓపెనింగ్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
బాలయ్య 107వ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు దర్శకులు హాజరయ్యారు. ముహూర్త సన్నివేశానికి వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు కలిసి డైరెక్టర్ గోపీచంద్ కి స్క్రిప్ట్ ని అందించారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్యను గోపీచంద్ చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారట. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |